రాష్ట్ర ఉద్యోగుల ఫెడరేషన్ పై ఎస్ఈసి నిమ్మగడ్డ ఫిర్యాదు... 

రాష్ట్ర ఉద్యోగుల ఫెడరేషన్ పై ఎస్ఈసి నిమ్మగడ్డ ఫిర్యాదు... 

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసి సన్నాహాలు చేస్తుంటే, ఉద్యోగులు మాత్రం సహకరించడం లేరు.  ఈరోజు ఎస్ఈసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు వివిధ జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొనలేదు.  పైగా, కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న నేపథ్యంలో సహకరించలేమని రాష్ట్ర  ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఫెడరేషన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో ఎస్ఈసి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు.  

తన ప్రాణాలకు ముప్పు కలిగినపుడు ఎదుటివారిని చంపే హక్కు రాజ్యాంగం తనకు కల్పించిందని వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.  తనను ఉద్దేశించి వెంట్రామిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, ఇది దురదృష్టకరం అని ఎస్ఈసి కమిషనర్ పేర్కొన్నారు.  వెంకట్రామిరెడ్డి తనపై భౌతిక దాడులకు దిగే అవకాశం ఉందని డీజీపీకి రాసిన లేఖలో ఎస్ఈసి కమిషనర్ పేర్కొన్నారు.  వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని ఎస్ఈసి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ డీజీపీని కోరారు.  మరి డీజీపీ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందో చూడాలి.