మున్సిపల్ ఎన్నికలు.. నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు..

మున్సిపల్ ఎన్నికలు.. నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు..

మున్సిపల్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎస్‌ఈసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇప్పటికే జిల్లాల అధికారులు.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యాం.. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి వివక్ష లేకుండా చేపడతామన్నారు.. అందరూ సహకరించడం వల్లనే పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగింది.. మున్సిపల్ ఓటర్లు చైతన్యం కలిగిన వాళ్లూ.. పంచాయతీ ఎన్నికలకంటే ఎక్కువ స్థాయిలో పాల్గొనాలని సూచించారు. ప్రతి ఓటరుకు ప్రభుత్వ సిబ్బంది ద్వారానే ఓటర్ స్లిప్పుల పంపిణీ చేయాలని నిర్ణయించామన్న ఆయన.. వచ్చే నెల 5వ తేదీలోగా ప్రభుత్వ యంత్రాంగమే ఓటర్ స్లిప్పుల పంపిణీ చేపట్టాలని ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, వలంటీర్లను ఎన్నికల విధుల్లో నిషేధించామని స్పష్టం చేశారు నిమ్మగడ్డ.. ఎన్నికల విధుల్లో కానీ.. ఎన్నికల్లో కానీ వలంటీర్లు జోక్యం చేసుకుంటే వారిపై క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే, ప్రభుత్వ విధుల్లో.. ప్రభుత్వం అప్పగించిన పనిని మాత్రం వలంటీర్లు చేపటొచ్చన్నారు.

టింటికి ఎన్నికల ప్రచారంలో ఐదుగురుకు మించి పాల్గొనకూడదని అభ్యర్థులకు సూచించారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌.. ప్రచారంలో రోడ్ షోలకు అనుమతిస్తాం.. డబ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక, నామినేషన్లు గందరగోళంపై త్వరలోనే వివరాలు అందుతాయన్న ఎస్‌ఈసీ.. బలవంతపు నామినేషన్ల విషయంలో అభ్యర్ధిత్వాల పునరుద్ధరణపై బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పరిగణనలోకి తీసుకుంటామన్నారు.. పరిమితులకు లోబడి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించిన ఆయన.. త్వరలోనే నామినేషన్ల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నామినేషన్లు వేయలేకపోయిన వారికి.. స్క్రూట్నీలో పోయిన వారికి తిరిగి నామినేషన్లు వేసుకునే అవకాశం ఇవ్వడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.