ఢిల్లీలో రెండో కరోనా మరణం... అప్రమత్తమైన ప్రభుత్వం

 ఢిల్లీలో రెండో కరోనా మరణం... అప్రమత్తమైన ప్రభుత్వం

దేశరాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.  కరోనా కేసులు పెరగడంతో పాటుగా అక్కడ మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.  దేశంలో రెండో మరణం ఢిల్లీలోనే సంభవించింది.  ఈరోజు అక్కడ రెండో మరణం సంభవించింది.  కొన్ని రోజుల క్రితం ఓ మహిళా కరోనా వైరస్ తో పోరాటం చేసి మరణించింది.  కాగా, ఏరోజు అక్కడ మరో మరణం సంభవించింది.  రాజధాని ప్రాంతంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి.  దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.   కరోనాను కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను మరింత కఠినం చేసేందుకు రెఢీ అయ్యింది.  ఇక దేశ రాజధాని లాక్ డౌన్ కావడంతో అక్కడ పనిచేసుకొని జీవనం సాగించే వలస కూలీలు సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్దం అయ్యారు.  

ఎలాంటి వాహనాలు లేకపోవడంతో కాలి నడకన సొంతగ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారు.  గ్రామాలు ఒక్కసారిగా బయలుదేరి వెళ్లడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  ఎక్కడివాళ్ళు అక్కడే ఉండిపోవాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి అభయం ఇచ్చినప్పటికి ప్రజలు గ్రామాలకు వెళ్లేందుకు సిద్దం కావడం విశేషం.