మరో అమ్మాయిని పట్టేసిన రామ్ !

మరో అమ్మాయిని పట్టేసిన రామ్ !

 

హీరో రామ్, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 'ఇస్మార్ట్ శంకర్' అనే కొత్త చిత్రాన్ని ప్రారంబించాడు.  ఇప్పటికే రెగ్యులర్ షూట్ మొదలైంది.  డబుల్ దిమాక్ హైదరాబాదీ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ క్యారెక్టర్ పూరి స్టైల్లో ఉండనుంది.  ఇందులో మొదటి కథానాయికగా 'సవ్యసాచి, మిస్టర్ మజ్ను' ఫేమ్ నిధి అగర్వాల్ ను తీసుకోగా రెండవ హీరోయిన్ పాత్ర కోసం నాభ నటేష్ ను  చూజ్ చేసుకున్నారు.  గతేడాది రిలీజైన 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అమ్మాయి.  ఈ సినిమాలో ఆమె నటనకు ఆడియన్స్ మంచి మార్కులే వేశారు.  దీంతో పూరి చూపు ఆ అమ్మాయి మీద పడింది.