బన్నీకి రెండో హీరోయిన్ ఈమేనా ?

బన్నీకి రెండో హీరోయిన్  ఈమేనా ?

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు.  ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ముగిసింది.  హాలీడే నుండి బన్నీ తిరిగిరాగానే రెండో షెడ్యూల్ మొదలవుతుంది.  తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది.  వారిలో పూజా హెగ్డే ఒకరు కాగా రెండో హీరోయిన్ కేతిక శర్మ అని తెలుస్తోంది.  ప్రస్తుతం ఈమె పూరి కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న 'రొమాంటిక్' సినిమాలో కథానాయకిగా నటిస్తోంది.  ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.