రేపటి నుంచి రెండో విడత టీకా... 

రేపటి నుంచి రెండో విడత టీకా... 

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణి వేగవంతంగా సాగుతున్నది.  తొలివిడతలో ఆరోగ్యకార్యకర్తలకు, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్ అందించారు. కాగా, మార్చి 1 వ తేదీ నుంచి రెండో విడత వ్యాక్సిన్ ను పంపిణి చేయబోతున్నారు.  రెండో విడతలో 60 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు, 45 సంవత్సరాలు దాటిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికీ వ్యాక్సిన్ ను అందించబోతున్నారు.  ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటె, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం ఈ వ్యాక్సిన్ కు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రేపటి నుంచి రెండో విడత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.