కత్తి మహేష్ ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది

కత్తి మహేష్ ను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది

మగబిడ్డకు జన్మనిచ్చిన ప్రణయ్ భార్య అమృతను కలిసేందుకు వచ్చిన కత్తి మహేష్ తో పాటు మహిళా సంఘాల నేతలను ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవించిన అమృతను చూసేందుకు వారు ఆసుపత్రికి వచ్చారు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది లోపలికి రాకుండా అడ్డుకోవడంతో వారు వాగ్వాదానికి దిగారు. పరువు హత్యకు బలైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత ఈరోజు సాయంత్రం మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.