డ్రోన్ లతో పహారా 

డ్రోన్ లతో పహారా 

తెలంగాణ ఎన్నికల కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.  మంచిర్యాల జిల్ల చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో డ్రోన్ కెమెరాలు, కేంద్ర సాయుధ బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. చెన్నూర్ ప్రాంతంలోని పొలింగ్ బూత్ లను, బందోబస్తు ఏర్పాట్లను రామగుండం పోలీసు కమిషనర్ శ్రీ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. మంచిర్యాల జిల్లలో  బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 698 పోలింగ్ కేంద్రాలున్నాయి. అందులో 425 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వీటిలో 47 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. 

నీల్వాయి, కోటపల్లి, చెన్నూర్ తో పాటు ప్రాణహిత ఉపనదికి 16 ఫెర్రీ పాయింట్స్,  వెంచేపల్లి, అర్జునగుట్ట, కల్లంపల్లి, శీర్షా లను  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.  ఈ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు.  షాడో టీమ్స్ ,కౌంటర్ ఆక్షన్ టీమ్స్ , టాస్క్ ఫోర్స్ టీమ్స్  ఏర్పాటు చేశారు. మావోయిస్ట్ ల నుంచి అంతరాయం ఉంటుందని భావించిన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రాణహిత పరివాహక ప్రాంతం అంతా  డ్రోన్ తో అనుసంధానం చేసుకొని, సీసీ కెమెరాలు, ఇంటర్నెట్ తో అనుసంధానించారు. అపరిచితుల కదలికలపై నిఘా పెట్టారు. లో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు.