ఇది బంగారం కాదు... సూర్యుడే... ఎలా ఉన్నాడో చూశారా ? 

ఇది బంగారం కాదు... సూర్యుడే... ఎలా ఉన్నాడో చూశారా ? 

బంగారం అంటే అందరికి ఇష్టమే.  బంగారం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు.  అందులో సందేహం అవసరం లేదు. ముఖ్యంగా మగువలు బంగారం ప్రియులు.  బంగారం ఏ రంగులో ఉంటుంది అంటే ఉదయాన్నే వచ్చే సూర్యుడు లేదంటే సాయంకాలం కనిపించే సూర్యుడు రంగులో ఉంటుందని అంటారు.  అయితే, సూర్యుడిని దగ్గర నుంచి ఎప్పుడైనా చూశారా అంటే లేదని అంటారు.  సూర్యుడి నుంచి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిపైనే వేడిగా ఉంటె తట్టుకోలేం.  

అలాంటి సూర్యుడి ఉపరితలం మీదకు వెళ్ళాలి అంటే మాములు విషయమా చెప్పండి.  కాదుకదా. అయితే, అమెరికన్ నేషనల్ సైన్స్ సంస్థ పవర్ ఫుల్ సోలార్ కెమెరా సమాయంతో సూర్యుడి ఉపరితలాన్ని మరింత స్పష్టంగా ఫోటోగా తీశారు. అందులో సూర్యుడు గోల్డ్ కలర్ లో మెరిసిపోతున్నాడు.  వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.