ఎన్టీఆర్ టీజర్ పై సీతక్క ట్వీట్ ..

ఎన్టీఆర్ టీజర్ పై సీతక్క ట్వీట్ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. చరణ్ 'మన్నెందొర అల్లూరి సీతారామరాజు'గా కనిపిస్తుండగా తారక్ గిరిజన ఉద్యమకారుడు 'కొమురం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడికల్ మల్టీస్టారర్ ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కాగా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' అని అల్లూరిగా రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేసాడు జక్కన్న. అప్పటినుంచి ఎన్టీఆర్ టీజర్ కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ ఇవాళ 11:30 నిమిషాలకు విడుదల చేశారు. ఈ టీజర్ లో కొమురం భీంగా ఎన్టీఆర్ ఇరగదీసాడు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ టీజర్ పై సినీప్రముఖులు ప్రసంశలు కురిపిస్తున్నారు. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ట్విటర్‌ వేదికగా  ప్రసంశలు కురిపించారు. మన్యం ముద్దుబిడ్డ. మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని ఆమె ట్వీట్‌ చేశారు.