రాజన్నసన్నిధిలో ఘనంగా రాములోరి కల్యాణం

రాజన్నసన్నిధిలో ఘనంగా రాములోరి కల్యాణం

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు భక్తులు. సీతారామ కల్యాణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు... సీతారాములకు పంచ ఉపనిషత్తు ద్వారా అభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. కాగా, వేములవాడ ఆలయంలో శివుడికి, రాముడికి సమానంగా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణం ప్రతిఏటా కనుల పండువగా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉగాది నుంచి ఘనంగా శ్రీరామనవమి వేడుకలు కొనసాగుతున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 14న శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనుండగా.. వేములవాడలో ఒకరోజు ముందుగానే ఈ వేడుక నిర్వహించడం మరోవిశేషం.