సెహ్వాగ్ ఐపీఎల్‌ను కాపాడాడు: గేల్
Apr 20, 2018 01:40 PM
విధ్వంస ఆటకు పెట్టింది పేరు వెస్టిండీస్ ఆటగాళ్లు. ఐపీఎల్ ప్రారంభమయినప్పటినుండి వెస్టిండీస్ ఆటగాళ్లు అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. గత ఐపీఎల్ సీజన్లో బెంగళూరు తరఫున ఆడిన గేల్ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో గేల్ ను ఈ ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ కొనుక్కోవడానికి అంతగా ఆసక్తి చూపలేదు. చివరలో పంజాబ్ జట్టు తక్కువ ధరకు కొనుక్కుంది. అయితే క్రిస్ గేల్ తాజా ఐపీఎల్‌లోనూ తన సత్తా చాటుతున్నాడు.
మొదటి మ్యాచ్ లలో గేల్‌ను తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇక మూడో మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు డైరెక్టర్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ చలవతో తుది జట్టులో వచ్చిన గేల్.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 63 పరుగులు చేసాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో విశ్వరూపం చూపించి సిక్స్‌లు బాదుతూ శతకం సాధించాడు. మ్యాచ్ అనంతరం గేల్ మాట్లాడుతూ.. సెహ్వాగ్‌కు కృతజ్ఞతలు. నన్ను జట్టులోకి తీసుకోవడం ద్వారా అతను ఈ ఐపీఎల్‌ను కాపాడాడు అని అన్నాడు. సెహ్వాగ్ తర్వాత నేను ఐపీఎల్‌ను కాపాడాను అంటూ ట్వీట్ చేశాడు. అవును అంటూ గేల్ రీ ట్వీట్ చేశాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)