అనుకోకుండా అత్తగారు వస్తే...

అనుకోకుండా అత్తగారు వస్తే...

బౌలర్ ఎవరైనా సరే పట్టించుకోకుండా మైదానంలో పరుగుల వరద పారించి అభిమానులను అలరించేవాడు భారత మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అభిమానులను అలరిస్తున్నాడు సెహ్వాగ్. అయితే అది మైదానంలో కాదు.. సోషల్ మీడియాలో. ప్రస్తుతం వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెహ్వాగ్ ట్వీట్‌తో పాటు ఒక వీడియో కూడా జత చేసి పోస్ట్ చేసాడు. ఈ ట్వీట్, వీడియో అభిమానులలో నవ్వులను పూయిస్తుంది.

ఆ వీడియోలో.. ఓ భర్త త‌న భార్య కాళ్లను చిన్న ప్లాస్టిక్ ట‌బ్‌లో పెట్టి కుడుగుతుంటాడు, ఇలా భార్యపై తాకున్న ప్రేమను చాటుకుండాడు. అదే స‌మ‌యంలో అత‌ని త‌ల్లి  అనుకోకుండా అక్క‌డ‌కు వ‌స్తుంది. ఇది గమనించిన వారు ఆమె వీరిని చూసేలోపే.. భార్య‌భ‌ర్త‌లు పొజిష‌న్స్ చేంజ్ చేసుకుంటారు. భ‌ర్త త‌ల‌ను భార్య కడుగుతున్న‌ట్టుగా నటిస్తారు. ఈ వీడియో చూసి మీరు కాసేపు సరదాగా నవ్వుకోండి. రిటర్మెంట్ అనంతరం సెహ్వాగ్ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.