ఈసారి కొత్తవాళ్లతోనే అంటున్న స్టార్ డైరెక్టర్ !

ఈసారి కొత్తవాళ్లతోనే అంటున్న స్టార్ డైరెక్టర్ !

'హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి' వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించి స్టార్ స్టేటస్ దక్కించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల కొన్ని పరాజయాల తర్వాత మరోసారి 'ఫిదా'తో తానేంటో నిరూపించుకున్నారు.  ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత ఆయన ఇప్పటి వరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు. 

తాజా సమాచారం మేరకు ఆయన తన నెక్స్ట్ సినిమాను స్టార్లతో కాకుండా అందరూ కొత్త నటులతోనే తీయాలని నిర్ణయించుకున్నారట.  ఈమేరకు నటీనటుల ఎంపిక జరుగుతోందట.  ఇకపోతే ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.