శేఖర్‌ కమ్ముల పేరుతో.. మోసం..

శేఖర్‌ కమ్ముల పేరుతో.. మోసం..

తన అసిస్టెంట్ డైరెక్టర్‌గా చెప్పుకుని  సినిమా అవకాశాలిప్పిస్తానంటూ క్వికర్‌, ఓఎల్‌ఎక్స్‌లో యూడ్స్‌ ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిపై ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దగ్గర ఎవరూ అసిస్టెంట్‌ డైరక్టర్లు లేరని ఆయన స్పష్టం చేశారు.  

వెలుగులోకి వచ్చిందిలా..
ఒంగోలుకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌కు వచ్చి శేఖర్‌ కమ్ములను కలిశాడు. మిగతా డిపాజిట్ తర్వాత చెల్లిస్తానని, ముందుకు అవకాశం ఇవ్వాలని కోరాడు. ఆవాక్కయిన శేఖర్‌ కమ్ముల.. అసలు విషయం అడగా.. ప్రకటన గురించి ఆ యువకుడు వివరించాడు. ఆ తర్వత ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.