అభిమానులకు షాకిస్తున్న సెలీనా గోమెజ్ పెళ్లి ప్రపోజల్

అభిమానులకు షాకిస్తున్న సెలీనా గోమెజ్ పెళ్లి ప్రపోజల్

హాలీవుడ్ పాప్ సింగర్ సెలీనా గోమెజ్ రీసెంట్ గా కేన్స్ చిత్రోత్సవంలో సందడి చేసింది.  ఆమె నటించిన హాలీవుడ్ సినిమా ది డెడ్ డోంట్ డై సినిమాను అక్కడ ప్రదర్శించారు.  ఈ సందర్భంగా సెలీనా రెడ్ కార్పెట్ పై నడిచి సందడి చేశారు. కేన్స్ లో షో తరువాత ఆమె చెప్పిన న్యూస్ విని అభిమానులు షాకయ్యారు.  

త్వరలోనే వివాహం చేసుకోబోతున్నానని, ఆ వ్యక్తి ఎవరో కాదని, ది డెడ్ డోంట్ డై సినిమాలో నటించిన బిల్ ముర్రేను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించింది.  ఈ ప్రకటనతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు.  అభిమానులైతే ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  68 సంవత్సరాల వయసున్న ముర్రేను 26 సంవత్సరాల వయసు కలిగిన సెలీనా వివాహం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.