తల్లీకూతుళ్లపై అత్యాచారం.. 'బాబా' అరెస్ట్

తల్లీకూతుళ్లపై అత్యాచారం.. 'బాబా' అరెస్ట్

మరో 'బాబా'ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళతోపాటు ఆమె మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బాబా ఆశూ మహరాజ్ అలియాస్ అసిఫ్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశూ మహరాజ్ కుమారుడు సమర్ ఖాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని తన ఆశ్రమంలో ఆశూ మహరాజ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఫిర్యాదు అందిందని పోలీసులు చెప్ఆపరు.  2008 నుంచి 2013 మధ్య ఆశు మహరాజ్, ఆయన మిత్రులు, కుమారుడు పలు మార్లు తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె కుమార్తెను కూడా ఆశ్రమానికి రప్పించి ఆమె పైనా బాబా అత్యాచారానికి పాల్పడ్డాడడని ఆరోపించింది.