సిద్దిపేట జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం

సిద్దిపేట జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం

సిద్దిపేట జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన వేచరేణి అనిల్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని గత ఆరుసంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. పెద్దలకు ఈ విషయం తెలియడంతో ఇద్దరిని మందలించారు. తాను ప్రేమించిన అమ్మాయి వివాహ నిశ్చితార్థం కావడంతో కలత చెందిన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన 15వ తేదిన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీశాడు. 

ఈనెల 15న అనిల్ బైక్ పై చేర్యాలకు వచ్చాడు. లెనిన్ నగర్ సమీపంలో రోడ్డుపక్కన పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు తన మిత్రుడికి వాట్సాప్ లోకేషన్ షేర్ చేశాడు. ఆందోళణ చెందిన మిత్రులు, అనిల్ కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకునేలోగా ప్రాణాలొదిలాడు. గమనించిన సమీప వ్యవసాయదారలు పోలీసులకు సమాచారం అందించారు. కొమురవెల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.