క్షణాల్లో ఆనందం ఆవిరి...సెల్ఫీ వీడియో బయటకి !

క్షణాల్లో ఆనందం ఆవిరి...సెల్ఫీ వీడియో బయటకి !

తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పడవ బోల్తా కొట్టిన ప్రాంతం ప్రమాదకరమైనది కావడం. గజ ఈత గాళ్లు కూడా అక్కడకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇండియన్ నేవీకి చెందిన హెలికాపర్లను రంగంలోకి దించారు. డైవింగ్ టీమ్స్ కూడా అందులోనే ఉన్నాయి. రెండు నేవీ హెలికాప్టర్లు ఇప్పటికే ప్రమాదం జరిగిన ఏరియా వరకు వెళ్లాయి. లోతైన ప్రాంతాలపై అవగాహన ఉన్నవారిని రెస్క్యూ కోసం ఉపయోగిస్తున్నారు.

ఇప్పటి వరకూ 12 మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే ప్రమాదం జరగడానికి 5 నిమిషాల ముందు పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాదాన్ని ఊహించని వారంతా సరదాగా సెల్ఫీలు దిగుతూ సన్నిహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. పడవ మునగడానికి 5 నిమిషాల ముందు వారంతా సంతోషంతో  కేరింతలు కొట్టారు. ఆ మధుర స్మృతులను పదిలం చేసుకోవాలని సెల్ఫీలు దిగారు. ఆ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది.