సీనియర్ అధికారి నన్ను రేప్ చేశాడు

సీనియర్ అధికారి నన్ను రేప్ చేశాడు

అమెరికా వైమానిక దళంలో ఫైటర్ జెట్ నడిపిన మొదటి మహిళ, ఆరిజోనా సెనేటర్ మార్థా మెక్ శాలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే సమయంలో ఒక సీనియర్ అధికారి తనను బలాత్కరించాడని చెప్పారు. వాయు సేనలో 26 ఏళ్ల పాటు పనిచేసిన 52 ఏళ్ల మెక్ శాలీ ఫైటర్ స్క్వాడ్రన్ (సైనిక విమానాలు మరియు పైలెట్ల)కి నాయకత్వం వహించారు. సైన్యంలో లైంగిక వేధింపులపై ఏర్పాటు చేసిన ఒక సెనేట్ సబ్ కమిటీ విచారణ సందర్భంగా మాట్లాడుతూ ఆమె తన స్వీయ అనుభవాన్ని వివరించారు.

'సైన్యంలో లైంగిక వేధింపులకు బలైనవాళ్లలో నేను కూడా ఉన్నాను. కానీ ఇంకా ఎందరో ధైర్యశాలురైన బాధితుల మాదిరిగా నేను నా వేధింపుల గురించి ఎవరికీ చెప్పలేదు' అని మెక్ శాలీ చెప్పారు. 'ఎందరో ఇతర మహిళలు, పురుషుల మాదిరిగా ఆ సమయంలో నేను కూడా వ్యవస్థను నమ్మలేదు' అన్నారు.

'నన్ను నేనే దోషిగా భావించాను. నేను సిగ్గుతో అయోమయంలో ఉన్నాను. నేను చాలా ధైర్యంగా, బలంగా ఉన్నానని అనుకున్నాను. కానీ నేను చాలా నిస్సహాయురాలిగా భావనకు లోనయ్యాను' అని మెక్ శాలీ చెప్పారు. రిపబ్లికన్ సెనేటర్ అయిన మెక్ శాలీ 'అపరాధులు తమ అధికారాలను అత్యంత దుర్వినియోగం చేశారు' అని అభిప్రాయపడ్డారు. 'ఒక కేసులో నన్ను బలిపశువుని చేశారు. ఒక సీనియర్ అధికారి నన్ను బలాత్కారం చేశాడు' అని భావోద్వేగానికి గురై తెలిపారు. ఈ సంఘటన గురించి చాలా ఏళ్లు తను మౌనంగా ఉన్నట్టు మెక్ శాలీ చెప్పారు. ఆ సంఘటన తర్వాత తను సైన్యాన్ని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు.

'కానీ ఆ తర్వాత సైన్యం ఒక్కో కుంభకోణంలో చిక్కుకుంటూ పోయిందో అప్పుడు నేను నా కెరీర్ లో నేను కూడా బాధితురాలినని కొందరికి తెలియాలని భావించాను' అని తెలిపారు.