హోరాహోరీగా జపాన్-సెనెగల్‌

హోరాహోరీగా జపాన్-సెనెగల్‌

ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచ కప్ లో జపాన్-సెనెగల్‌ జట్లు తమ మొదటి మ్యాచ్ లో విజయాలు సాధించాయి. సెనెగల్‌ జట్టు పోలెండ్‌పై .. జపాన్‌ జట్టు కొలంబియాపై గెలిచి ఊపుమీదున్నాయి. మరో మ్యాచ్‌ గెలిస్తే నాకౌట్‌ బెర్తును ఖాయం చేసుకునే అవకాశం ఇరు జట్లది. ఈ సమయంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు హోరాహోరీగా  సాగింది. గ్రూప్‌-హెచ్‌లో భాగంగా ఏక్టరీన్ బర్గ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ 2-2తో డ్రా అయింది. మ్యాచ్ 11వ నిమిషంలో సెనెగల్‌ తరఫున సదియో మానె గోల్ చేసి 1-0తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అనంతరం జపాన్‌ ఆటగాడు టకాషి ఇనుయ్‌ 34వ నిమిషంలో గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేసాడు. ఇక రెండవ భాగంలో సెనెగల్‌ ఆటగాడు మోసా వాగ్‌ 71వ నిమిషంలో గోల్‌ సాధించి.. 2-1తో సెనెగల్‌ ఆధిక్యం సంపాదించింది. అనంతరం పోటాపోటీగా మ్యాచ్ సాగింది. మరో 12 నిమిషాల్లో ఆట  ముగుస్తుందనగా.. 1-2తో వెనుకబడిన జపాన్‌ను కీసుకె హోండా అద్భుతమైన గోల్‌తో స్కోరును 2-2తో సమం చేసాడు. ఈ గ్రూప్‌లో ఇరు జట్లు చెరో 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. గురువారం జరిగే మ్యాచ్‌ల్లో పోలాండ్‌తో జపాన్, కొలంబియాతో సెనెగల్‌ ఆడతాయి. తాజా ఫలితంతో గ్రూప్‌-హెచ్‌లో అన్ని జట్లకూ నాకౌట్‌  అవకాశాలు ఉన్నాయి.

Photo: FileShot