విజయాన్ని ఆస్వాదించారు ఇలా..

విజయాన్ని ఆస్వాదించారు ఇలా..

సాకర్ విజయాన్ని ఇలా కూడా ఆస్వాదించవచ్చు అని చెబుతున్నారు సెనెగల్ ఫుట్ బాల్ అభిమానులు. పోలెండ్ పై సెనెగల్ విజయం తర్వాత ఆదేశ సాకర్ అభిమానులు ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.  ఆ ఆనందాన్ని అందరిలాగా కాకుండా వెరైటీగా ఆస్వాధించారు. మ్యాచ్ తర్వాత వారు కూర్చున్న సెక్షన్స్ ను శుభ్రం చేసి వెళ్లారు. ఇది అందరిని ఆకట్టుకుంది. ఈ విజువల్స్ ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలెండ్ పై సెనెగల్ విజయం చరిత్రలో నిలిచిపోనుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.