సమంతకి కొడుకుగా సీనియర్ నటుడు !

సమంతకి కొడుకుగా సీనియర్ నటుడు !

 

స్టార్ హీరోయిన్ సమంత చేస్తున్న చిత్రాల్లో 'ఓ బేబీ ఎంత సక్కగున్నావే' కూడ ఒకటి.  ఈ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు.  కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' తెలుగు రీమేకే ఈ చిత్రం.  ఏ సినిమాలో సమంత 70 ఏళ్లుగా వృద్దురాలిగా, 20 ఏళ్ల యువతిగా కనిపించనుంది.  70 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ 20 ఏళ్ల యువతి శరీరంలో చిక్కుకుంటే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా థీమ్.  ఇందులో సీనియర్ నటుడు రావు రమేష్ సమంతకి కుమారుడిగా నటిస్తుండటం విశేషం.  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.