ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మి పార్వతి పాత్ర..?

ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మి పార్వతి పాత్ర..?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది.  ఈ సినిమాలో భారీ తరుణం నటిస్తున్న సంగతి తెలిసిందే.  బయోపిక్ ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.  ఫస్ట్ పార్ట్ ఎన్టీఆర్ సినిమాల గురించి.. రెండో పార్ట్ రాజకీయ జీవితం గురించి ఉంటుంది.  సినిమా రంగం గురించి అంతా క్లారిటీగా ఉన్నా.. రాజకీయ రంగం గురించి అందరిలోను ఓ కన్ఫ్యూషన్ ఉంది.  జీవిత చరిత్ర అంటే చివరి వరకు చూపించాలి కదా.  రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కొంతవరకు మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది అనే పుకార్లు వినిపిస్తున్నాయి.  దీనిలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియడంలేదు.  

 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తరువాత ఆయన రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి.  వీటిని ఈ సినిమాలో చూపిస్తారో లేదో తెలియదు.  మరోవైపు లక్ష్మి పార్వతి పాత్ర కోసం సీనియర్ నటి ఆమనిని ఎంపికచేశారని.. ఎన్టీఆర్ లక్ష్మి పార్వతికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో చూపించబోతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.  బాలకృష్ణ మాత్రం ఇందుకు సుముఖంగా లేడని మరికొందరి వాదన.  మహానాయకుడులో ఏం చూపిస్తున్నారు ఏం చూపించడం లేదు అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.