విజయ నిర్మల కన్నుమూత

విజయ నిర్మల కన్నుమూత

ప్రముఖ దర్శకురాలు, సినీ నటి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయిన విజయ నిర్మల కన్నుమూశారు.  గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.  ఆమెది సహజ మరణమని తెలుస్తోంది.  ఈరోజు ఉదయం 11 గంటలకు ఆమె పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలో ఉన్న ఆమె ఇంటికి తీసుకువస్తారు.  ఈరోజు మొత్తం అక్కడే ఉంచి రేపు ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తారు.  అంత్యక్రియలు కూడా రేపే జరగనున్నాయి.  

ఏడేళ్ల వయసుకే తమిళంలో బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె 11 ఏళ్ల వయసులో 'పాండురంగ మహత్యం' చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు.  దాదాపు 44 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.  ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులంతా తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.