కొలంబో పేలుళ్ల నుండి తప్పించుకున్న రాధిక !

కొలంబో పేలుళ్ల నుండి తప్పించుకున్న రాధిక !

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు వరుస బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే.  కోచికడే, సెయింట్ సెబాస్టియన్, బట్టికలోయ చర్చిల్లో, హోటల్ షాంగ్రి లా, సిన్నమాన్ గ్రాండ్ హోటళ్లల్లో ఈ పేలుళ్ల జరిగాయి.  ఈ పేలుళ్ల నుండి సీనియర్ నటి రాధికా తృటిలో తప్పించుకున్నారు.  ఈస్టర్ వేడుకల కోసం కొలంబో వెళ్లిన రాధికా సిన్నమాన్ గ్రాండ్ హోటల్ కు వెళ్లారు.  అందులో నుండి ఆమె బయటికొచ్చిన కొద్దిసేపటి తర్వాత పేలుళ్లు జరిగాయి.  పేలుళ్ల గురించి తెలుసుకున్న రాధికా దేవుడు తన వెంట ఉన్నాడని, తాను బయటికొచ్చిన కొద్దిసేపట్లోనే పేలుళ్లు జరిగాయని చెప్పుకొచ్చారు.