వెనకబడ్డ సీనియర్ నటి

వెనకబడ్డ సీనియర్ నటి

కర్ణాటకలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్నది.  ఆ రాష్ట్రంలో బీజేపీలో మాగ్జిమమ్ స్థానాలు కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతున్నది.  ఇదిలా ఉంటె ఇప్పుడు అందరి చూపులు మాండ్య నియోజక వర్గంపైనే ఉన్నాయి.  ఆ నియోజక వర్గం నుంచి అంబరీష్ సతీమణి, సినీనటి సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది.  జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేశారు. 

ఈ నియోజక వర్గంలో మొదట సుమలత లీడింగ్ లో ఉన్నది.  ఈ ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, నిఖిల్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఇక తుంకూర్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న దేవెగౌడ వెనుకంజలో ఉన్నట్టు సమాచారం.