నాకెలాంటి ప్రమాదం జరగలేదంటున్న హీరో రాజశేఖర్ !

నాకెలాంటి ప్రమాదం జరగలేదంటున్న హీరో రాజశేఖర్ !

కొద్దిరోజుల క్రితం హీరో రాజశేఖర్ కు 'కల్కి' సినిమా సెట్లో ప్రమాదం జరిగి గాయాలైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  మళ్ళీ తాజాగా ఆయనకు ప్రమాదం జరిగినట్టు రూమర్లు ఓఅప్డనుకున్నాయి.  దీంతో స్వయంగా రాజశేఖర్ స్పందించారు.  

పుకార్లలో మసాలా కొంచెం ఎక్కువైందన్న ఆయన 10 రోజుల కృత్యం 'కల్కి' షూట్లో గాయపడిన మాట నిజమేనని, కానీ షూట్ ఆపలేదని, తాను నెమ్మదిగా కోలుకుంటున్నానని అన్నారు.  అలాగే షూట్ కోసం సినిమా టీమ్, కుటుంబంతో కలిసి కులుమనాలి వెళ్తుండగా రోడ్డు సరిగా లేకపోవడం వలన ప్రయాణం ఆగిందని, ఎవరికీ ఏమీ కాలేదని, మళ్ళీ తమ జర్నీ మొదలైందని, ఈ రూమర్ల వలన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఫోన్లు చేస్తున్నారని వివరణ ఇచ్చారు.