తల్లిగా మాత్రం కనిపించాలనుకోవట్లేదన్న సీనియర్ హీరోయిన్ !

తల్లిగా మాత్రం కనిపించాలనుకోవట్లేదన్న సీనియర్ హీరోయిన్ !

హీరోయిన్ గా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించేసిన సిమ్రన్ పెళ్లి తర్వాత ఈమధ్యే సినిమాల సంఖ్య పెంచారు.  ప్రస్తుతం ఈమె యువ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోసూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.  ఇందులో ఆమె రజనీకి భార్యగా కనిపించనున్నారు.  

ఇన్నేళ్ల తన కెరీర్ రజనీతో కలిసి నటించండంతో సంపూర్ణమైందన్న ఆమె హీరోలకు తల్లిగా మాత్రం నటించాలని అనుకోవట్లేదని తేల్చి చెప్పేశారు.  బాలీవుడ్లో కరీనా కపూర్, ఐశ్వర్య, కాజోల్ తరహాలో కథలో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని ఉందని అన్నారు.