గుణశేఖర్ పై సీనియర్ హీరో ఆరోపణలు

గుణశేఖర్ పై సీనియర్ హీరో ఆరోపణలు

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో రాణి రుద్రమదేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రుద్రమదేవి.  ఈ సినిమాలో సుమన్ విలన్ గా నటించాడు.  రుద్రమదేవిగా చేసిన అనుష్కతో క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్ ఉంటుందని చెప్పి ఒప్పించాడని, తరువాత సినిమాలో ఆ సీన్ లేకుండా చేయడమే కాకుండా తనకు ఇవ్వవలసిన రెమ్యునరేషన్ కంటే తక్కువగా ఇచ్చారని సీనియర్ హీరో సుమన్ ఆరోపణలు చేశారు.  

సుమన్ చేసిన ఆరోపణలపై గుణశేఖర్ ఎలా స్పందిస్తారో చూడాలి.  రుద్రమదేవి భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.  రుద్రమదేవిగా అనుష్క నటన అద్భుతం అని చెప్పాలి.  అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రను చేయగా, రానా స్పెషల్ రోల్ చేశారు.