దారుణం...'దిశ'ను బతికుండగానే కాల్చేశారు ?

దారుణం...'దిశ'ను బతికుండగానే కాల్చేశారు ?

చనిపోయిన తరువాత కాదు...బతికుండగానే దిశను సజీవ దహనం చేశారు కామాంధులు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిశ హత్య ఘటనలో మరికొన్ని దారుణ నిజాలు బయటకు వచ్చాయి. దిశ అపస్మారకస్థితిలో ఉన్నప్పుడే పెట్రోల్ పోసి తగటబెట్టామని జంకుబొంకు లేకుండా, ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా జైలు కాపలాదారుని దగ్గర నోరు విప్పాడు ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఆరిఫ్‌. ప్రస్తుతం దిశ హత్య కేసు నిందితులు నలుగురు చర్లపల్లి జైలులో, ప్రత్యేక నిఘాలో ఉన్నారు. వీరికి కాపలా కాస్తున్న కొంతమంది సిబ్బంది వారితో మాటమాట కలిపినప్పుడు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయాలను ఈ నలుగురు బయటపెట్టినట్టు తెలుస్తోంది.

ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ చెప్తున్న ప్రకారం ఒకసారి కాదు...రెండు సార్లు దిశపై అత్యాచారానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దిశను బలవంతంగా కాళ్లు, చేతులు పట్టుకొని సమీప ప్రాంతానికి ఈ నలుగురు లాక్కెళ్తున్నప్పుడు ఆమె పెద్దగా కేకలు వేసింది. మళ్లీ ఆమె కేకలు వేయకుండా చెన్నకేశవులు తన జేబులో ఉన్న మద్యం సీసాను తీసి దిశ నోట్లో బలవంతంగా పోశాడు. అప్పటికే భయంతో, టెన్షన్‌తో ఉన్న దిశ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది.  వెంటనే ఆమెపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు.  ఆ తరువాత ప్రాణాలతోనే ఉన్న దిశను లారీ ఎక్కించి అందులో కూడా అత్యాచారం చేశారు. దీంతో ఆమె పూర్తిగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. పూర్తిగా నిశ్చేతనంగా ఉన్న దిశ చనిపోయిందనుకొని చటాన్‌పల్లి వంతెన దగ్గరకు తీసుకువచ్చి బతికుండగానే పెట్రోల్‌ పోసి తగలబెట్టారని సమాచారం.