మరో 450 పాయింట్లు డౌన్‌

మరో 450 పాయింట్లు డౌన్‌

స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపుతున్న సెన్సెక్స్. ఉదయం ఒక మోస్తరు నష్టంతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు సెషన్‌ కొనసాగే కొద్దీ మరింత బలహీనమైంది. ఏ స్థాయిలోనూ మార్కెట్‌కు మద్దతు దక్కడం లేదు. దీంతో సెన్సెక్స్ 450 పాయింట్లు, నిఫ్టి 175 పాయింట్లు క్షీణించాయి. ఇవాళ మార్కెట్‌ను ప్రధాన ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ముంచాయి. రిలయన్స్‌ పతనం సూచీలను పూర్తిగా ముంచేశాయి. రెండు రోజుల్లోనే రిలయన్స్‌ 12 శాతంపైగా క్షీణించింది. ఇటీవల రూ. 1300 వద్ద పటిష్ఠంగా ఉన్న రిలయన్స్‌ ఇపుడు రూ.1078 వద్ద ట్రేడవుతోంది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిఫ్టిని చావు దెబ్బతీశాయి. నిఫ్టిలో ఉన్న మూడు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు భారీగా క్షీణించడంతో నిఫ్టిపై తీవ్ర ప్రభావం చూపింది. హెచ్‌పీసీఎల్‌ 23శాతం, బీపీసీఎల్‌ 19 శాతం ఐఓసీ 15 శాతంపైగా నష్టపోయాయి. ఇతర షేర్లలో గెయిల్‌, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ బాగానష్ట పోయాయి.