రికార్డు లాభాలతో ముగిసిన నిఫ్టి

రికార్డు లాభాలతో ముగిసిన నిఫ్టి

మార్కెట్‌ ఇవాళ మరో రికార్డు సృష్టించింది. దలాల్‌ స్ట్రీట్‌ చరిత్రలో తొలిసారి నిఫ్టి 11,800ని దాటింది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో మొదలైన నిఫ్టి తరవాత బలపడుతూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు అప్‌ ట్రెండ్‌కు అనుకూలించాయి. డాలర్‌ కూడా నిలకడగా ఉంది. నిఫ్టి ఇవాళ 97 పాయింట్ల లాభంతో 11,787 వద్ద ముగిసింది.  అంతకుమునుపు నిఫ్టి 11,810 గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే మార్కెట్‌ను ఇవాళ ప్రైవేట్‌ బ్యాంకులు బాగా ప్రభావితం చేశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో టాప్‌ గెయినర్స్‌లో ఇండస్‌ ఇండ్‌  బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టైటాన్‌, ఓఎన్‌జీసీ, గ్రాసిం షేర్లు ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో విప్రో, సిప్లా, గెయిల్‌, టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు ఉన్నాయి. ఇక బీఎస్‌ఈలో టాప్‌ గెయినర్స్‌గా అదానీ గ్రీన్‌, పీసీ జ్యువల్లర్స్‌, దీపక్‌ ఫర్టిలైజర్స్‌,  స్పైస్‌జెట్‌ , టాటా స్టీల్‌ (పీపీ) నిలిచాయి. ఇక టాప్‌ లూజర్స్‌ జాబితాలో జెట్‌ ఎయిర్‌వేస్‌, రియలన్స్‌ క్యాపిటల్‌, ఆర్‌ కామ్‌, రెయిన్‌ ఇండస్ట్రీస్‌,  అలహాబాద్‌ బ్యాంక్‌ షేర్లు ఉన్నాయి.