కరోనా ఎఫెక్ట్ : 11 ఏళ్లలో లేనంతగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

కరోనా ఎఫెక్ట్ : 11 ఏళ్లలో లేనంతగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు


స్టాక్‌ మార్కెట్లు ఇవాళ కుప్పకూలాయి. వరుసగా ఆరో రోజు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద 5 లక్షల కోట్లు ఆవిరైంది. వెయ్యిపాయింట్లకు పైగా నష్టాలతోనే ప్రారంభమైన సెన్సెక్స్.. ఆ తర్వాత కూడా అదే ట్రెండ్ కొనసాగించాయి. మధ్యాహ్నం సమయానికి 1250 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 350 పాయింట్లు కోల్పోయింది.. ఇటీవలికాలంలో ఇంత పెద్ద స్థాయిలో మార్కెట్లు పతనం కావడం ఇదే తొలిసారి.. 
 
స్టాక్ మార్కెట్లకు కరోనా భయం వెంటాడుతోంది. చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు సోకింది. ఇది రోజురోజుకూ మరిన్ని దేశాలకు విస్తరిస్తుండడంతో స్టాక్‌ మార్కెట్లు ప్రభావానికి గురవుతున్నాయి. పవిత్ర మక్కాకు రాకపోకలను నిలిపేస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంతో పాటు యూరోప్‌లో కరోనా ఫాస్ట్‌గా వ్యాపిస్తుండడం మార్కెట్లలో భయాలకు కారణమైంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్‌ బిజినెస్‌పై వైరస్‌ ఇంపాక్ట్ అధికంగా పడుతోంది.. దీంతో మార్కెట్లు కుదేలయ్యాయి. 2008 తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి.!
 
ప్రపంచమార్కెట్లన్నీ నష్టాలతో ముగియడంతో ఈరోజు దాని ప్రభావం ఏషియన్ మార్కెట్లపై పడింది. వాల్‌స్ట్రీట్ మార్కెట్ రాత్రి భారీగా పతనమైంది. చైనా, జపాన్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి.. వీటి ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపించింది.. మరోవైపు IVX ఇండెక్స్‌లో భారత్‌ 15 శాతం వృద్ధి సాధిస్తుందనే భయం కూడా ఇన్వెస్టర్లను కంగారు పెట్టించింది. జీడీపీ వృద్ధి రేటు 4.7గా ఉంటుందనే ఊహాగానాలు కూడా మార్కెట్లపై పడింది. చైనా నుంచి ముడిసరుకు, విడి భాగాల సరఫరాల్లో అంతరాయం ఏర్పడడం కూడా మరో కారణం.. ఓవరాల్‌గా మార్కెట్లకు ఈరోజు బ్లాక్‌ ఫ్రైడే..!!