నష్టాల్లో ముగిసిన నిఫ్టి

నష్టాల్లో ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా... లాభాలు కొన్ని మార్కెట్లకే పరిమితం కావడం...పైగా నామమాత్రమే కావడంతో నిఫ్టి ఆరంభ లాభాలు కాసేపటికే కరిగిపోయాయి. ఆరంభంలో దాదాపు 50 పాయింట్ల వరకు పెరిగిన నిఫ్టి తరవాత క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. మిడ్ సెషన్‌ తరవాత మొదలైన యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగడంతో నిఫ్టి 73 పాయింట్ల నష్టంతో క్లోజైంది. సెన్సెక్స్‌ కూడా 218 పాయింట్లు నష్టపోయింది.  ఇవాళ దాదాపు అన్ని రంగాల షేర్ల సూచీలు క్షీణించాయి. నిఫ్టిలో 50 షేర్లలో 40 షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టి షేర్లలో లాభాలతో ముగిసిన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అదానీ పోర్ట్స్, ఎల్‌ అండ్‌ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ షేర్లు ఉన్నాయి. నష్టాల్లో ముగిసిన నిఫ్టి ప్రధాన షేర్లలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, గ్రాసిం, హిందాల్కో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐఓసీ షేర్లు ఉన్నాయి. ఇతర షేర్లలో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆరున్నర శాతం పెరిగాయి. అలాగే ఐడియా షేర్‌ 8 శాతంపైగా నష్టపోయింది.