ఏడో రోజూ నిఫ్టికి నష్టాలు

ఏడో రోజూ నిఫ్టికి నష్టాలు

అంతర్జాతీయ మార్కెట్ భయాలు నిఫ్టిని ఇంకా వీడలేదు. నిన్న యూరో, అమెరికా మార్కెట్లు లాభాల్లోకి వచ్చినట్లే వచ్చి... నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో క్లోజయ్యాయి. మిడ్ సెషన్‌లో యూరో నష్టాలతో ప్రారంభమైనా.. మన మార్కెట్‌ అనూహ్యంగా నిఫ్టి దాదాపు లాభాల్లోకి వచ్చింది. కాని ఆ స్థాయిలో నిలబడలేకపోయింది. నిఫ్టి ఇవాళ 37 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కాని వెంటనే అమ్మకాల ఒత్తిడి కారణంగా 11,255కి క్షీణించింది. అంటే దాదాపు వంద పాయింట్లకు పైగా తగ్గింది. వీక్లీ క్లోజింగ్‌ కారణంగా మధ్యాహ్నం 2.30కల్లా నిఫ్టి క్రితం ముగింపు స్థాయి 11,357కి వచ్చింది. కాని అక్కడ వచ్చిన ఒత్తిడి కారణంగా 58 పాయింట్ల నష్టంతో 11,307 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 230 పాయింట్లు తగ్గింది. ఈరోజు మీడియా షేర్ల సూచీ మూడు శాతం పెరగ్గా, మెటల్‌ సూచీ ఒకటిన్నర శాతం క్షీణించింది. ఇతర సూచీల్లో పెద్ద మార్పు లేదు. నిఫ్టి ప్రధాన షేర్లలో ఇవాళ టాప్‌ గెయినర్స్.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హీరో మోటో కార్ప్‌ ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌లో ఉన్న షేర్లు... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఉన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్... జెట్‌ ఎయిర్‌వేస్‌, డిష్‌ టీవీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, వెల్‌కార్ప్‌, రెడింగ్టన్‌ ఉన్నాయి. సెన్సెక్స్‌ టాప్‌ లూజర్స్‌లో ఎక్లియరెక్స్‌, సుజ్లాన్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, సీజీ పవర్‌, టాటా స్టీల్‌ (పీపీ)