కేంద్ర మంత్రి ప్రకటన...దూసుకుపోతున్న మార్కెట్లు

కేంద్ర మంత్రి ప్రకటన...దూసుకుపోతున్న మార్కెట్లు

ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా దేశీయ తయారీ రంగానికి కార్పొరేట్ ట్యాక్స్ ను తగ్గిస్తున్నట్టు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థికమంత్రి ప్రకటనతో స్టాక్ మార్కెట్లు మెరుపు వేగంతో దూసుకుపోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సెన్సెక్స్‌ ఏకంగా 1900 పాయింట్ల పైన ఎగబాకింది. దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంత విధంగా జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ పరుగులు తీస్తుండగా బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ 2000 పాయింట్లకు పైగా లాభంతో దూసుకెళ్తోంది.  మధ్యాహ్నం 1.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ ఏకంగా 2060 పాయింట్ల లాభంతో 38,153 వద్ద, నిఫ్టీ 610 పాయింట్ల లాభంతో 11,314 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.96గా కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ లో ఉన్న 30 కంపెనీలు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.