1100 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

1100 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ఎగ్జిట్‌ పోల్స్‌తో మార్కెట్‌లో జోష్‌ వచ్చింది. ఇటీవల భారీగా క్షీణించిన షేర్లు ఇవాళ అనూహ్యంగా పెరిగాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, మెటల్‌ రంగ షేర్లు లబ్ది పొందాయి. ఇక అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే అదానీ గ్రూప్‌ షేర్లన్నీ టాప్ గెయినర్స్‌ జాబితాలో ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 341 పాయింట్ల లాభంతో 11748 వద్ద ట్రేడవుతుండతా, సెన్సెక్స్‌ 1160 పాయింట్లు పెరిగి 39091 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన అయిదు షేర్లలో మూడు అదానీ గ్రూప్‌ షేర్లే. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఏకంగా 20.3 శాతం పెరిగి రూ. 143 వద్ద ట్రేడవుతుండగా, అదానీ వపర్‌ 14.5 శాతం,  అదానీ గ్రీన్‌ 14 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. ఇక ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ షేర్‌ కూడా 12 శాతం పెరిగింది. ఇక ఎస్‌బీఐ షేర్‌ 8 శాతం పెరగ్గా, అదానీ పోర్ట్స్‌ 7.6 శాతం పెరిగింది. 
షేర్లకన్నా...
నగదు మార్కెట్‌ కన్నా డెరివేటివ్‌ మార్కెట్‌లో లాంగ్‌ పొజిషన్‌ తీసుకున్న ఇన్వెస్టర్లు భారీగా లబ్ది పొందారు. ఆప్షన్స్‌లో అట్‌ ద మనీ... అంటే క్యాష్‌ మార్కెట్‌ షేర్‌ ధరకు దగ్గరగా ఉన్న ఆప్షన్స్‌లో కాల్స్‌ కొన్నవారికి 100 శాతం లాభాలు వచ్చాయి.