లాభాలతో ముగిసిన నిఫ్టి

 లాభాలతో ముగిసిన నిఫ్టి

వారం రోజులుగా ఇదే ట్రెండ్‌. ఉదయం స్వల్ప నష్టంతో ప్రారంభం కావడం... దిగువ స్థాయి నుంచి కోలుకుని భారీ లాభాలతో ముగియడం. ఇవాళ కూడా నిఫ్టి 16 పాయింట్ల లాభంతో ప్రారంభమై... 11,612 నుంచి 11,578కి పడిపోయింది. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్‌ గ్రీన్‌లోకి వచ్చిన వెంటనే కోలుకుంది. 11,578 నుంచి ఏకంగా 11,647కు చేరింది. ఈ స్థాయిలో కాస్త అమ్మకాల ఒత్తిడి రావడంతో 11,612  వద్ద నిఫ్టి ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు ఇవాళ సానుకూలంగా ఉన్నాయి. నిన్న భారీగా క్షీణించిన క్రూడ్‌ ఇవాళ అదే స్థాయిలో కోలుకుంది. ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి 29 పైసలు బలహీనపడింది. నిఫ్టి ప్రధాన షేర్లలో ఐటీసీ, గెయిల్‌, మారుతీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సిప్లా షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐఓసీ, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు... రెయిన్‌ ఇండస్ట్రీస్‌, పీసీ జ్యువెల్లర్స్‌, టీవీ18 బ్రాడ్‌కాస్టింగ్‌, స్సైస్‌ జెట్‌, సుజ్లాన్‌. టాప్‌ లూజర్స్‌గా నిలిచిన షేర్లు... ఇండియా బుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, ఆర్‌ కామ్‌, టాటా స్టీల్‌ (పీపీ) దీవాన్‌ హౌసింగ్‌ పైనాన్స్‌, రాడికో. పీసీ జ్యువల్లర్స్‌ ఏకంగా 18 శాతం పెరగ్గా, సుజ్లాన్‌ 9 శాతం పెరిగింది.