దీపావళి స్పెషల్ మూరత్ ట్రేడింగ్...లాభాల్లో సెన్సెక్స్

దీపావళి స్పెషల్ మూరత్ ట్రేడింగ్...లాభాల్లో సెన్సెక్స్

దీపావళి రోజున గంటపాటూ జరిగే ముహురత్‌ ట్రేడింగ్‌ సంప్రదాయంగా సాగింది. హీరో రాజ్ కుమార్ రావ్ ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం లాంఛనంగా కొట్టి గంట కొట్టడంతో సాయంత్రం 6.15 నిమిషాలకు ముహురత్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఏటా దీపావళి రోజున స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు ప్రత్యేక ట్రేడింగ్‌ జరుపుతాయి. ముహురత్‌ ట్రేడింగ్‌ సంస్కృతి బీఎస్‌ఈలో 1957లోనే ప్రారంభం కాగా, ఎన్‌ఎస్‌ఈలో 1992లో మొదలైంది. హిందూ సంప్రదాయం అనుసరించి కొత్త వ్యాపార సంవత్సరం ప్రారంభానికి సూచికగా దీపావళి రోజున ఈ ట్రేడింగ్‌ను జరుపుతారు.   సెన్సెక్స్‌ 300 పాయింట్ల వరకూ ఎగబాకి 39,350 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 11,650 పాయింట్లను దాటింది.