నష్టాలతో ముగిసిన నిఫ్టి

నష్టాలతో ముగిసిన నిఫ్టి

స్టాక్‌ మార్కెట్‌ రోజంతా చాలా వరకు నష్టాల్లోనే ఉంది. మిడ్‌ సెషన్‌ సయమంలో కాస్త కొనుగోళ్ళ మద్దతు లభించినట్లు అనిపించినా... చివరికి అమ్మకందార్లదే పైచేయి అయింది. ఉదయం 20 పాయింట్ల లాభంతో 11,861 వద్ద ప్రారంభమైన మార్కెట్‌ కొద్ది సేపట్లోనే ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 11,871కి చేరింది. తరువాత రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టి బాగా దెబ్బతీసింది. చిన్న తరహా ప్రభుత్వ బ్యాంకులకు మార్కెట్‌కు మద్దతుగా నిలిచినా... మార్కెట్‌ పీడగా మారిన దీవాన్‌, ఎస్‌ బ్యాంక్‌తో పాటు అనిల్‌ అంబానీ గ్రూప్ షేర్లు సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. అలాగే జీ గ్రూప్‌ కంపెనీలు కూడా. నిఫ్టి ఒకదశలో 11,775కి క్షీణించినా... క్లోజింగ్‌ కాస్త కోలుకుని 11,788 వద్ద ముగిసింది. నిఫ్టి 53 పాయింట్లు, సెన్సెక్స్‌ 192 పాయింట్లు నష్టపోయాయి. ప్రపంచ మార్కెట్ల దృష్టి అంతా జీ-20 దేశాల సదస్సుపై ఉంది. ముఖ్యంగా అమెరికా, చైనా అధ్యక్షుల మధ్య జరిగే చర్చలు ఫలితాల కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో గెయిల్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. 
టాప్‌ లూజర్స్‌గా ముగిసిన షేర్లు... ఎస్‌ బ్యాంక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ షేర్లలో టాప్‌ గెయినర్స్‌గా నిలిచిన షేర్లు...సోలార్ ఇండస్ట్రీస్‌, థామస్‌ కుక్‌, ఈఐడీ ప్యారీ, సెంట్రమ్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌
సెన్సెక్స్‌ షేర్లలో టాప్‌ లూజర్స్‌....దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, దీపక్‌ ఫర్టిలైజర్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, సుజ్లాన్‌, శ్రేయా ఇన్‌ఫ్రా