లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

లాభాల‌తో ప్రారంభ‌మైన నిఫ్టి

అంత‌ర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ‌వుతుండ‌గా మ‌న మార్కెట్లు మాత్రం ఒక మోస్తరు లాభాల‌కే ప‌రిమితం అయింది. ఓపెనింగ్‌లో 50 పాయింట్లు పెరిగిన నిఫ్టి ప్రస్తుతం 30 పాయింట్ల లాభం 10,865 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. విప‌క్ష‌, అధికార ప‌క్షాల మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌డంతో మార్కెట్లు ఒక శాతంపైగా పెరిగాయి. ఉద‌యం నుంచి ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి. తైవాన్ త‌ప్ప మిగిలిన మార్కెట్లన్నీ ఒక‌ శాతంపైగా లాభ‌ప‌డ్డాయి. జ‌పాన్ నిక్కీ ఒక‌టిన్నర శాతం లాభంతో ట్రేడ‌వుతోంది. మ‌న మార్కెట్లలో ఆ ఉత్సాహం క‌న్పించ‌డం లేదు. నిఫ్టి ప్రధాన షేర్లలో స‌న్ ఫార్మా, ఇండియా బుల్స్ హౌసింగ్‌, ఐటీసీ, ప‌వ‌ర్‌ గ్రిడ్‌, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముందున్నాయి. న‌ష్టాల్లో టాప్ ఫైవ్‌లో ఉన్న షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, హీరో మోటోకార్ప్‌, టైటాన్ ఉన్నాయి. ఇత‌ర షేర్లలో క్రాంప్టన్ గ్రీవ్స్ ప‌వ‌ర్ ప‌ది శాతం న‌ష్టంతో ట్రేడ‌వుతోంది. చ‌క్కటి ఫ‌లితాలు ప్రక‌టించిన బాటా 3 శాతం పైగా లాభ‌ప‌డింది.