డాన్స్ మాస్టర్ తో తమన్నా మరోసారి !

డాన్స్ మాస్టర్ తో తమన్నా మరోసారి !

ప్రముఖ క్రొయోగ్రఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో కలిసి తమన్నా 2016లో 'దేవి' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.  ఈ చిత్రాన్ని ఏఎల్. విజయ్ తెరకెక్కించారు.  భాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ విజయాన్ని అందుకుంది. 

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ మొదలుపెట్టారు విజయ్.  ఇందులో కూడ తమన్నా, ప్రభుదేవాలు కలిసి నటించనున్నారు.  స్క్రిప్ట్ పనులన్నీ పూర్తికాగా త్వరలో షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు టీమ్.  తమన్నా, ప్రభుదేవాల కాల్ షీట్స్ కుదిరిన వెంటనే షూట్ మొదలుకానుంది.