ఆస్ట్రేలియా ఓపెన్ లో సెరెనా కు షాక్ 

ఆస్ట్రేలియా ఓపెన్ లో సెరెనా కు షాక్ 

అస్ట్రేలియా ఓపెన్ లో స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ కు షాక్ తగిలింది. టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన మాజీ చాంఫియన్ క్వార్టర్స్ లో పరాజయం పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్) చేతిలో 6-4, 4-6, 7-5 తేడాతో 16వ సీడ్ సెరెనా ఓటమిపాలైంది. మ్యాచ్‌లో తొలి సెట్ కోల్పోయిన సెరెనా పుంజుకొని రెండో సెట్ దక్కించుకుంది. రసవత్తరంగా సాగిన నిర్ణయాత్మక మూడో సెట్‌ను ప్లిస్కోవా కైవసం చేసుకుంది. దీంతో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన టెన్నిస్ ప్లేయర్‌గా ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్‌(24)ను సమం చేయాలనుకున్న సెరెనాకు నిరాశ తప్పలేదు. ప్రిక్వార్టర్స్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హాలెప్‌ను సెరెనా మట్టికరిపించిన విషయం తెలిసిందే. సెరెనా - ప్లిస్కోవా ముఖాముఖి పోరులో సెరెనాకు ఇది రెండో ఓటమి. 2016 యూఎస్‌ ఓపెన్‌ సెమీస్‌లో కూడా సెరెనా ఓటమి పాలయ్యింది.