ఫ్రెంచ్ ఓపెన్ నుండి తప్పుకున్న సెరెనా విలియమ్స్...

ఫ్రెంచ్ ఓపెన్ నుండి తప్పుకున్న సెరెనా విలియమ్స్...

సెరెనా విలియమ్స్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ 2020 నుండి తప్పుకుంది. మూడుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ గా నిలిచిన సెరెనా విలియమ్స్ పారిస్‌లో జరుగుతున్న గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ నుండి గాయంతో వైదొలిగినట్లు రోలాండ్ గారోస్ నిర్వాహకులు తాజాగా తెలిపారు. "యుఎస్ ఓపెన్ తర్వాత గాయం నుండి కోలుకోవడానికి నాకు తగినంత సమయం దొరకలేదు. నేను ఇప్పుడు ఆరు వారాల పాటు కూర్చోవడం తప్ప మారె పని చేయను. అలాగే ఈ సంవత్సరం మరో టోర్నమెంట్ ఆడను" అని విలియమ్స్ తెలిపింది. అయితే యుఎస్ ఓపెన్ లో సెమీస్ కు చేరుకున్న సెరెనా అక్కడ మాజీ ప్రపంచ నంబర్ వన్ విక్టోరియా అజరెంకా చేతిలో ఓటమిపాలైంది. మొదటి రౌండ్ లో దూకుడుగా ఆడిన సెరెనాకు తర్వాత ఎడమకాలికి గాయం అయింది. దాంతో ఆ తర్వాత కోర్ట్ లో చురుకుగా కదలలేకపోయింది. ఈ గాయం నుండి పూర్తిగా కోలుకోకుండానే ఫ్రెంచ్ ఓపెన్ లో అడుగు పెట్టి ఇప్పుడు దీనికి దూరం అవుతుంది. ఇక 2020 లో జరిగే మిగిత టోర్నీలతో పాటుగా 2021 లో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ ను కూడా ఆమె కోల్పోయే అవకాశం ఉంది.