శ్రావణి సూసైడ్ కేసు అప్డేట్..!

శ్రావణి సూసైడ్ కేసు అప్డేట్..!

శ్రావణి సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ విషయాన్ని ఎస్సార్ నగర్ పాలీసులు వెల్లడించారు. దేవరాజ్ కాకినాడ నుండి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిపారు. అంతే కాకుండా శ్రావణితో మాట్లాడిన పలు ఫోన్ సంభాషణలకు సంబంధించి దేవరాజ్ ఫోన్ రికార్డింగ్ లను పోలీసులకు అందినట్టు తెలిపారు. నిన్న దేవ రాజ్ ను వివిధ కోణాల్లో పోలీసులు విచారించారు. నిన్నటి నుండి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే దేవరాజ్ ఉన్నాడు. ఇక ఈ నెల 7వ తారీఖున ఎస్సార్ నగర్ పిఎస్ పరిధిలోని శ్రీ కన్య హోటల్ లో శ్రావణి దేవరాజ్ కలిసి భోంచేసిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు కలెక్ట్ చేసారు. సీసీ ఫుటేజ్ లో దేవరాజు శ్రావణి సానిహిత్యంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అదేరోజు సాయి రెడ్డి శ్రావణి పై చేయి చేసుకున్నట్లు పోలీసులకు దేవరాజు తెలిపాడు. దేవరాజు తో శ్రావణి చనువుగా ఉంటూ తిరుగుతున్న విషయం సాయిరెడ్డి అదే రోజు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో శ్రావణి తో ఆమె  కుటుంబ సభ్యులు మాట్లాడారు. అదే రోజు అర్ధరాత్రి శ్రావణి సూసైడ్ చేసుకున్నట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి ని విచారిస్తే కీలక విషయాలు బయటికొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. దాంతో నేడు విచారణకు రావాలంటూ సాయి రెడ్డి కి ఎస్సార్‌నగర్‌ పోలీసులు నోటీసులు జారీ చేసారు. మారోవైపు శ్రావణి, దేవరాజ్‌రెడ్డిపై జూన్ లో కేసు పెట్టిన సమయంలో ఆమెతో నిర్మాత మాట్లాడిన తాలూకు ఫోన్‌ సంభాషణ పై పోలీసులు ద్రుష్టి పెట్టారు. ఆ కేసులో శ్రావణికి సలహాలను సూచనలు సినీ నిర్మాత అశోక్ రెడ్డి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అనే కోణంలో అశోక్ రెడ్డి ని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.