పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి!

పోలీసులకు చుక్కలు చూపిస్తోన్న సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి!

యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్‌లో జరిగిన దారుణాలతో సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కోర్టు అనుమతితో ఆరు రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... ఇప్పటికే ఐదు రోజులుగా శ్రీనివాస్‌రెడ్డిని విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇవాళ ఆరో రోజుకాగా... నేతిటితో శ్రీనివాస్‌రెడ్డి కస్టడీ ముగియనుంది. సరూర్‌నగర్‌లోని ఎస్‌వోటీ కార్యాలయంలో శ్రీనివాస్‌రెడ్డిని విచారిస్తున్న పోలీసులకు ఎలాంటి సమాచారం రావడంలేదు. తనను విచారిస్తున్న పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు సైకో కిల్లర్ శ్రీనివాస్... ఎలాంటి సమాధానం రాకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు పోలీసులు. ఇవాళ్టితో కస్టడీ ముగియనుండడంతో శ్రీనివాస్‌రెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆరు రోజుల కస్టడీలో ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయిన పోలీసులు... మరోసారి సైకో కిల్లర్‌ని కస్టడీలోకి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్మాయిల హత్యల్లో శ్రీనివాస్‌తో పాటు మరి కొంత మంది హస్తం ఉన్నట్టు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు హాజీపూర్ గ్రామస్తులు... దీంతో శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను కూడా విచారిస్తున్నారు పోలీసులు.