బంప‌రాఫ‌ర్‌.. మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కే బంగారం...

బంప‌రాఫ‌ర్‌.. మార్కెట్ ధ‌ర కంటే త‌క్కువ ధ‌ర‌కే బంగారం...

బంగారం అంటే భార‌తీయుల‌కు ఎంతో సెంటిమెంట్.. ఏ శుభ‌కార్యం అయినా.. బంగారం కొనేస్తుంటారు.. ఇంట్లో జ‌రుపుకునే చిన్న చిన్న ఫంక్ష‌న్ల నుంచి పెళ్లిళ్ల వ‌ర‌కు వారి ఆర్థిక ప‌రిస్థితిని బ‌ట్టి బంగారం తీసుకుంటారు. అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌కు సంబంధం లేకుండా కూడా భార‌త్‌లో కొన్ని సార్లు బంగారం ధ‌ర పెరిగిపోతుంది. ఇక‌, ప్ర‌స్తుతం.. మార్కెట్‌లో రూ.50 వేల మార్క్‌ను క్రాస్ చేసి.. ఆల్‌టైం హై రికార్డుల‌ను తాకింది బంగారం ధ‌ర‌.. అయితే, బంగారం త‌క్కువ ధ‌ర‌కే కొనుగోలు చేసే అవ‌కాశం వ‌చ్చింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51 వేల స‌మీపంలో ఉన్న త‌రుణంలో.. మార్కెట్ ధర కన్నా ఏకంగా రూ.2,300 తక్కువ ధరకే ప‌సిడిని సొంతం చేసుకునే అవ‌కాశం వ‌చ్చింది.. అది ఎలా అంటే.. బంగారంపై ఇన్వెస్ట్ చేయ‌డ‌మే.. మార్కెట్‌లో బంగారం ధ‌ర రూ.51 వేల చేరువ‌లో ఉండ‌గా.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గోల్డ్ బాండ్ స్కీమ్ ద్వారా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని కేవ‌లం రూ.48,520కే సొంతం చేసుకోవ‌చ్చు.. కానీ, మీరు బంగారం పొంద‌లేరు.. బంగారంపై ఇన్వెస్ట్ చేసి.. బాండ్ పొందుతారు.

2020-21 సిరీస్ నాలుగో విడత కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్.. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.. ఇప్ప‌టికే బంగారం ధ‌ర‌ను కూడా నిర్ణ‌యించారు.. గ్రాము బంగారం ధరను రూ.4,852గా నిర్ణయించారు. అంటే, 10 గ్రాముల బంగారం కేవ‌లం రూ.48520 మాత్ర‌మే.. ప్ర‌స్తుత మార్కెట్‌లో బంగారం ధ‌ర కంటే ఇది చాలా త‌క్కువ‌.. మీరు.. ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ స‌ల‌హా ప‌లు బ్యాంకుల్లో ఈ గోల్డ్ బాండ్ల‌ను కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. అంతే కాదు, స్టాక్ ఎక్స్చేంజీలు, పోస్టాఫీసుల్లో కూడా ఈ బాండ్లు సొంతం చేసుకోవ‌చ్చు. మ‌రో విష‌యం ఏంటంటే.. ఆన్‌లైన్‌లో గోల్డ్ బాండ్ల‌ను కొంటే.. గ్రాముకు అద‌నంగా మ‌రో రూ.50 త‌క్కువ‌కే ల‌భిస్తుంది. అంటే.. వ‌న్ గ్రామ్ గోల్డ్ బాండ్ రూ.4802కే పొంద‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఒక్కో వ్య‌క్తి ఒక ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌లో గరిష్టంగా 4 కేజీల వరకు గోల్డ్ బాండ్లను కొనే వెసులుబాటు ఉంటుంది.. అదే, ట్రస్ట్‌లు, ఇతర సంస్థలు అయితే.. 20 కేజీల వరకు పెట్టుబ‌డి పెట్ట‌‌వ‌చ్చు. ఇక‌, ఈ బాండ్ల‌పై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో వడ్డీతోపాటు మీ బాండ్ల విలువకు సమానమైన మొత్తాన్నిపొంద‌వ‌చ్చు. ఏదేమైనా.. బంగారం త‌క్కువ ధ‌ర‌కే పొంద‌డం.. దానిపై వ‌డ్డి కూడా పొందే అవ‌కాశం ఉండ‌డం నిజంగా శుభ‌వార్తే.