హనుమ విహారికి గోల్డెన్‌ ఛాన్స్‌..!

హనుమ విహారికి గోల్డెన్‌ ఛాన్స్‌..!

తెలుగు తేజం హనుమ విహారికి అరుదైన అవకాశం లభించినట్టు తెలిసింది. విహారితోపాటు మరో ఆరుగురు టీమిండియా టెస్ట్‌ ప్లేయర్లు ఈ ఏడాది కౌంటీ క్రికెట్‌లో ఆడబోతున్నారు. ఐసీసీ తొలి వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌కు సన్నాహకాల్లో భాగంగా వీరంతా ఇంగ్లండ్‌ వెళ్లి ఆయా కౌంటీల తరఫున బరిలోకి దిగబోతున్నారు. చటేశ్వర్‌ పుజారా, అజింక్యా రహానె, పృథ్వీ షా, హనుమ విహారి, మయాంక్‌ అగర్వాల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలు కౌంటీల్లో ఆడేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే  యార్క్‌షైర్‌తో పుజారాకు మూడేళ్ల ఒప్పందం ఉంది. హాంప్‌షైర్‌తో  రహానె డీల్ సెట్ చేసుకున్నాడు. ఇక.. విహారి, షా, మయాంక్‌లు కౌంటీలతో సంప్రదింపుల్లో ఉన్నారని తెలిసింది.