వివేకా బాడీపై ఏడు బలమైన గాయాలు..

వివేకా బాడీపై ఏడు బలమైన గాయాలు..

హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి భౌతికకాయంపై ఏడు బలమైన గాయాలను గుర్తించారు వైద్యులు. ఒంటిపై మొత్తం ఏడు గాయాలు ఉండగా... వైఎస్ వివేక నుదుటిపై రెండు లోతైన గాయాలు... తల వెనుకాల బలమైన గాయం ఉంది. తొడ, చేతులపై కూడా పదునైన గాయాలు ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై మాట్లాడిన పోలీసుఅధికారి రాహుల్ దేవ్ శర్మ.. హత్య జరిగిందని భావిస్తున్నాం.. నుదుటిపై, తలపై చేతిపై గాయాలున్నాయన్నారు. ఘటనా స్థలంలో ప్రింగర్ ప్రింట్స్ దొరికాయి... మరిన్ని క్లూస్ వెతుకుతున్నామన్నారు. అసలు రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు లోపల ఏం జ రిగిందో తెలుసుకుంటున్నామని వెల్లడించారు. తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మరోవైపు వైఎస్ వివేకా భౌతికకాయానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యుల బృందం.. గంట పాటు పోస్ట్‌మార్టం చేశాం. కీలకమైన అవయవాలు సేకరించినట్టు తెలిపారు. సేకరించిన అవయవాలను ఫోరెన్సిక్ కు పంపుతున్నామని వెల్లడించారు. ఇక వీటి పరిశీలను కర్నూలు నుంచి పులివెందులకు రానుంది ఫోరెన్సిక్ నిపుణుల బృందం.